ముద్ర ప్రతినిధి,జగిత్యాల : జగిత్యాల వెలమ సంక్షేమ మండలి అధ్వర్యంలో గత ఏడాది ప్రమాదవశాత్తు మరణించిన రాపల్లి గండ్ర సుమంత్ రావు కుటుంబ సభ్యులు గండ్ర సుగుణాకర్ రావుకు రూ. లక్షా చెక్కును అందజేశారు. అలాగే ప్రమాదవశాత్తు గండ్ర వంశీధర్ రావు మరణించిగ వెలమ సంక్షేమ మండలి అధ్వర్యంలో రూ. 72,820 విరాళాలు సేకరించి అయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా విరాళాలకు సహకరించిన వెలమ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి అద్యక్షుడు అయిల్నేని సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి దన్నపునేని వేణు గోపాల్ రావు, ఉపాధ్యక్షులు బండారి దివాకర్ రావు, కోశాధికారి వెన్నమనేని కృష్ణ రావు, సంఘటిత కార్యదర్శులు అయిల్నేని రవీందర్ రావు, కార్యవర్గ సభ్యులు మేన్నేని సురేందర్ రావు , యాచమనేని అజయ్ రావు, మెన్నేని ప్రవీణ్ రావు, కళకుంట్ల రాంప్రసాద్, మహిళ కమిటీ సభ్యులు బలమూరి సరళ, అయిల్నేని శ్రీలత లు పాల్గొన్నారు.నేషనల్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గండ్ర రామేశ్వర్ రావు గారు సలహామండలి సభ్యులు పురుషోత్తం రావు, రామచందర్ రావు గార్లు పాల్గొన్నారు.
