Take a fresh look at your lifestyle.

పుర అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.గురువారం కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డుల్లో అంతర్గత రహదారులు కాలువ నిర్మాణాల కు భూమి పూజ చేసి మాట్లాడారు.రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కావడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. భగత్ సింగ్ తండాలో 15 లక్షల వ్యయంతో మురుగు కాలువ, కేశవ నగర్ లో 25 లక్షలతో సైడ్ డ్రైనేజీ, రాఘవేంద్ర కాలనీలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్ ,బాల్ రాం నగర్ లో సీసీ రోడ్, 8వ వార్డు సుభాష్ నగర్ లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 10 లక్షల పనులకు భూమి పూజ చేశారు.వన మహోత్సవం లో భాగంగా ఎమ్మెల్యే క్యాపు కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కల్వకుర్తి మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో చేతివృత్తుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ మహమూద్ షేక్ , కల్వకుర్తి మాజీ సర్పంచ్ లు బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, నాయకులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి, సంజీవ్ కుమార్ యాదవ్,మాజీ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.