Take a fresh look at your lifestyle.

ప్రజావాణి కార్యక్రమంలో 2 ఫిర్యాదుల స్వీకరణ ఫిర్యాదులకు చట్టప్రకారం త్వరిత పరిష్కారం: అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు

 

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు దారుల నుండి రెండు ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులలో భార్యాభర్తల వివాదానికి సంబంధించిన ఒక అర్జీ, న్యాయ సంబంధిత మరో అర్జీ స్వీకరించబడింది.

సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐ, సి‌ఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యల స్థితిని తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు ఎలాంటి భయం లేకుండా, పైరవీలు లేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించడం, పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేయడం, శాంతి భద్రతలను కాపాడడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.