- రెండు రోజుల పాటు అక్కడే.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తీనా బాటపట్టారు. బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఆయన నేడు, రేపు రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. నేడు ఢిల్లీలో ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఈ భేటీలో కీలకంగా చర్చిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. కాగా టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) అనే ఎన్‌జీవోను నడిపిస్తున్నారు. ఇది అనేక దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన భేటీలో టోనీబ్లెయిర్‌తో పలు విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఏఐసీసీ పెద్దలను కలిసి పెండింగ్ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ అధిష్టానాన్ని, పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.