- పిడిఎస్ రైస్ పట్టివేత.
ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల రూరల మండలం తిమ్మాపూర్ లోని హనుమాన్ సాయి రైస్ మిల్ పై హైదరాబాద్ సివిల్ సప్లై& విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ రైస్ ను కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారం మేరకు రైస్ మిల్ పై హైదరాబాద్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిలువ ఉంచి, రీసైక్లింగ్ చేస్తున్న పీడీఎస్ రైస్ ను అధికారులు పట్టుకున్నారు. దీంతో ఓఎస్డీ, ఇతర అధికారులతో రైస్ మిల్ యాజమాని కొండా లక్ష్మణ్ వాగ్వాదానికి దిగారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
