ముద్ర, మోత్కూర్:
కుల వ్యవస్థ నిర్మూలన కోసం, స్త్రీ విద్య కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావు పూలే అని మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేటి యువత ఆయన చూపిన దారిలో పయనించాలని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీ నరసింహ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పైల్ల సోమిరెడ్డి, , బీసీ సంఘం నాయకులు గుండగోని రామచంద్రు గౌడ్ ,అవిశెట్టి అవిలి మల్లు, గడ్డం నరసింహ, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బయ్యని రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.