Take a fresh look at your lifestyle.

వృద్ధులపై దాడి చేసింది మనువడే 4.5 తులాల బంగారం, వాహనం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు

 ముద్ర ప్రతినిధి, మెదక్:

వృద్ధ దంపతులపై ఇనుప రాడ్ తో పట్ట పగలు దాడి చేసి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

ఎలాంటి పని చేయకుండా, సులువుగా డబ్బులు సంపాదించి, చేసిన ఎనిమిది లక్షల అప్పులు తీర్చడానికి ఈ దాడికి పాల్పడ్డాడు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు తుమ్మల అంజయ్య, సావిత్రి దంపతులకు ఐదుగురు సంతానం.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అందులో పెద్ద కూతురు కృష్ణ వేణి తన కుమార్తెను కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం మాసన్ పల్లికి చెందిన పరిగే వెంకటనారాయణకు ఇచ్చి వివాహం చేశారు.. ఏ పని చేయకుండా జూలాయిగా తిరుగుతూ మద్యం తాగుతూ ఎనిమిది లక్షలు అప్పు చేశాడు. సులువుగా అప్పు తీర్చాలనే ఉద్దేశ్యంతో పథకం ప్రకారం తుప్రాన్ నుండి చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి వెళ్లి ఇంట్లో ఎవరు లేని సమయంలో పట్ట పగలు వృద్ధ దంపతుల పెద్ద కుమార్తె కృష్ణవేణి కూతుర భర్త వెంకటనారాయణ (వరుసకు మనువడు) ముఖానికి మాస్క్ వేసుకుని కత్తితో బెదిరించి, ఇనుప రాడ్ తో ఇద్దరిని బలంగా కొట్టి వృద్దురాలి మెడలోంచి రెండున్నర తులాల బంగారు పుస్తలే తాడు, తులంన్నర బంగారం గొలుసు, అర తులం బంగారు ఉంగరం తీసుకుని ఈ నెల 25న పారిపోయాడు. వృద్ధ దంపతుల పెద్ద కుమారడు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ డి వి శ్రీనివాస్ రావు ఛాలెంజ్ గా తీసుకుని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 48 గంటల్లో నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుని నుండి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందిoచారు. ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట్ రాజగౌడ్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.