Take a fresh look at your lifestyle.

చిన్న కాళేశ్వరం భూ సేకరణ పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర:

చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, గ్రామ సభల నిర్వహణకు ముందస్తుగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. గ్రామ సభల్లో రైతుల నుండి వచ్చిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రాజెక్ట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణను దశలవారీగా అమలు చేయాలని, ప్రాధాన్యత క్రమంలో సంబంధిత ప్రాంతాల్లో భూములను సేకరించాలన్నారు.అనుబంధ కాలువలు మరియు ఇతర అవసరాల కోసం భూములు సేకరించబడుతున్నట్లు ఆయన తెలిపారు. సాగు మరియు త్రాగునీటి అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ మరియు మేఘా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎస్డీసి రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కుసుమకుమారి, ఇరిగేషన్, రెవెన్యూ, మెగా అధికారులు పాల్గొన్నారు

మహాదేవపూర్, ముద్ర: చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, గ్రామ సభల నిర్వహణకు ముందస్తుగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. గ్రామ సభల్లో రైతుల నుండి వచ్చిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రాజెక్ట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణను దశలవారీగా అమలు చేయాలని, ప్రాధాన్యత క్రమంలో సంబంధిత ప్రాంతాల్లో భూములను సేకరించాలన్నారు.అనుబంధ కాలువలు మరియు ఇతర అవసరాల కోసం భూములు సేకరించబడుతున్నట్లు ఆయన తెలిపారు. సాగు మరియు త్రాగునీటి అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ మరియు మేఘా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎస్డీసి రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కుసుమకుమారి, ఇరిగేషన్, రెవెన్యూ, మెగా అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.