బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత వచ్చేనా అనే శీర్షికతో సోమవారం ముద్ర పత్రిక లో ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో జరిగిన ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు పై స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన భూ సేకరణతో పాటు ఏర్పాటుపై ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. త్వరలోనే యూనివర్సిటీ ఏర్పాటు కార్యక్రమానికి తానే వస్తానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు పై నెలకొన్న సందిగ్ధత సీఎం తాజా ప్రకటనతో తొలగిపోయింది.