Take a fresh look at your lifestyle.

కారుతో డికొట్టి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్

  • నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు తరలించిన పోలీస్ లు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై జగిత్యాల పట్టణ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పట్టణ సిఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన పాదం మల్లేష్ తన తమ్ముడి కూతురు వితన్వితో కలిసి బైక్ ఫై ఇంటి నుంచి కండ్లపల్లి రోడ్డులో గల తన తోట వైపు వెళ్తుండగా ఇంటి సమీపంలోనే కండ్లపెల్లి రోడ్డులో ఎదురుగా వస్తున్న టిఎస్ 21జి 3465 టాటా టియాగో కారు డ్రైవరు అతిగా మద్యం సేవించి కారును అజాగ్రత్తగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో పాదం మల్లేష్ కు, అతని తమ్ముని కూతురు వితన్వికి తీవ్ర గాయాలు కాగా అక్కడే వున్న స్థానికులు వారిద్దరినీ హాస్పిటల్ కి తరలించగ, డాక్టర్లు పరిశీలించి పాదం మల్లేష్ చనిపోయడని తెలపగా చిన్నారి వితన్విని జగిత్యాల ఎంసి హెచ్ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుడి తండ్రి పాదం రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పట్టణ సిఐ వేణు గోపాల్ కేసు నమోద్ చేసి కారును నడిపిన నిందితుడు జగిత్యాల పట్టణానికి చెందిన నస్పూరి మనిదీప్ ను అరెస్టు చేసి జైలు కు తరలించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.