Take a fresh look at your lifestyle.

కనుల పండువగా నృసింహ స్వామి రథోత్సవం

కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని దుంపేట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం రోజు ఉదయం ఆలయంలో రథ హోమం, రథ బలి, అనంతరం రథోత్సవ కార్యక్రమంను ఆలయ అర్చకులు నారంబట్ల వామన్ శర్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ ఉత్సవంలో పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని గోవింద నామ స్మరణ చేశారు. ముగింపూ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి నాగవేల్లి, పుష్పయాగంతో ఉత్సవాలను ముగించారు.ఈ మహోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండల పోలీసుల ఆధ్వర్యంలో కథలాపూర్ ఎస్సై జి. నవీన్ కుమార్ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు.ఈ కార్యక్రమం గ్రామ విడిసి సభ్యుల ఆధ్వర్యంలో జరుగగా గ్రామ యూత్ సభ్యులు, విద్యార్థి సేవ సభ్యులు గ్రామ మహిళా సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.