Take a fresh look at your lifestyle.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

 

మహాదేవపూర్, ముద్ర:

భారతీయ జనతా పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 1980 వ సంవత్సరంలో ఏప్రిల్ 6 న స్థాపించబడి అంత్యోదయ లక్ష్యంతో ఏకత్మాత మానవవాదం సిద్దాంతంగా పనిచేస్తూ నేడు ప్రపంచంలో అతి పెద్ద పార్టీ గా అవతరించిoదని మండల పార్టీ అధ్యక్షులు రామ్ శెట్టి మనోజ్ అన్నారు . సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ద్యేయంగా వికసిత్ భారత్ నిర్మాణం లో భాగమై ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆన్కారి రాజేందర్, ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ చాగర్ల రవి, వార్డ్ సభ్యులు సోన్నారి శ్యామ్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, దడిగెల వెంకటేష్, నాగుల సాయి, ,రాజు, రాకేష్, అర్జున్, లక్కీ, జనసేన నాయకులు అవినాష్, రాజేష్, అభిమానులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.