Take a fresh look at your lifestyle.

ఉచిత వైద్య శిబిరం

ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని గుండ్లపల్లిలో కంబాల జహంగీర్, పాండు, కృష్ణ యాదవ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ యాదవ్, ముక్కర్ల మల్లేష్ యాదవ్, బబ్బురి శ్రీధర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్లు రోగులకు ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ నెంబర్ పేరబోయిన పెంటయ్య, ముక్కెర్ల అండలు, పేరబోయిన మహేందర్, కంబాల సాయి తేజ్,పబ్బల నరసింహ, కంబాల సాయి కుమార్, బండి అనిల్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.