ముద్ర నడిగూడెం……
మండల కేంద్రంలో గల శ్రీకొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థుల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.తమను విద్యావంతులుగా తీర్చిదిద్దిన గురువులైన విరామప్రధానోపాధ్యాయులు పసుపులేటి బిక్షమయ్య,విరామ డ్రిల్ మాస్టర్ హబీబుద్దీన్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, ఈ పాఠశాలలో పొందిన విద్య,క్రమశిక్షణ తమ జీవితాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఉపాధ్యాయులు చూపిన మార్గదర్శనం వల్లే తాము వివిధ రంగాల్లో స్థిరపడగలిగామని కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.

సమ్మేళనంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అనుభవాల పంచుకోవడం, జ్ఞాపికల ప్రదర్శన నిర్వహించారు.అలాగే భవిష్యత్‌లో పాఠశాల అభివృద్ధికి సహకరించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎండి అఫ్జల్, చిల్లంచర్లసత్యనారాయణ, పున్నం గోపాలరావు,కె వి ఎస్ ఎన్ గుప్తా,శ్రీ ఆంజనేయులు,నూనె వెంకన్న, కొల్లు వెంకటేశ్వరరావు,రఘు నాగేశ్వరరావు,కారంశెట్టి సత్యనారాయణ,షరీఫ్, దుర్గ దత్త,ధనలక్ష్మి, విద్యాసాగర్, లక్ష్మీనారాయణ రెడ్డి,దుర్గారావు, లింగయ్య,విజయ కుమారి, రామ్ రెడ్డి,అనసూర్య,వీర కుమారి,కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.