Take a fresh look at your lifestyle.

తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్

రెండేళ్ల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది
సిఎం గా కెసిఆర్ తిరిగి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి నిత్యం సంపాదనకే పరిమితమైనారు ఆరు గ్యారెంటీ హామీలపై ప్రజలు నిలదీస్తే గుడ్లు పీకేస్తాను అంటున్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్
కేటీఆర్ రోడ్ షోకు కదం తొక్కిన
బి ఆర్ ఎస్ శ్రేణులు

. పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీమయమైన తాండూర్ ఇందిరా చౌక్

ముద్ర: తాండూర్.

రెండేళ్ల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది
సిఎం గా కెసిఆర్ తిరిగి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి నిత్యం కెసిఆర్ ను తిడుతూ కోట్ల సంపాదన చేస్తున్నారు
ఆరు గ్యారెంటీ హామీలపై ప్రజలు నిలదీస్తే గుడ్లు పీకేస్తాను అంటున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. ఈ ఆరు గ్యారెంటీ హామీల్లో ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చ లేదని తెలిపారు. , 420 హామీలకు ఊసే లేదని, అలాగే ప్రతి నెల అభయ హస్తం కింద
మహిళలకు 2,500, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం, వృద్ధులకు రూ. 4000 పింఛన్ ఇలా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు ఒకటే అన్ని విమర్శించారు. బిజెపికి ఓటు వేస్తే మొరిల్లో ఓటు వేసినట్లే అని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం తాండూరు
ప్రాంతానికి నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తే దానిని కొడంగల్ కు దొంగలా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకెళ్లారని తెలిపారు. మరోసారి పరిగి సభలో తాండూర్ అభివృద్ధి కొరకు రూ. 1000 కోట్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి మరోసారి మున్సిపల్ ఎన్నికల ముందు మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎక్కడైనా పర్యటిస్తే పలు మంచి విషయాల గురించి చర్చిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిరోజు మాజీ సీఎం కేసీఆర్ ను బూతు మాటలతో తిడుతూ నిత్యం రూ.వెయ్యి కోట్లు ఆర్జిస్తున్నారని విమర్శించారు.
తాండూర్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తాండూర్ ప్రాంతానికి రూ.1680 కోట్ల నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు .మాతా శిశు హాస్పిటల్, ఐటిఐ కళాశాల, రూ. 16 కోట్లతో చిలుక వాగు పనులు, పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి మొదలగు పనులు చేసి తాండూర్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు .మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బి ఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రోహిత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, తాండూర్ బీ ఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి
పట్లోళ్ల నరసింహులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల దీప, శ్రీనివాస్ చారి, పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.