కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల వాసవి అమ్మవారి దేవాలయంలో మండల పూజ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పాలెపు రాముశర్మ వైదిక నిర్వహణలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అర్చన అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. అనంతరం మహిళలు ఆరు గ్రూపులుగా ఏర్పడి వాసవి మాత, లలిత సహస్రనామ అఖండ పారాయణం చదివారు. గురువారం ఉదయం 9 గంటలకు పారాయణం ప్రారంభం కాగా 24 గంటల పాటు కొనసాగుతోందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి రాజు, మహిళ సంఘం అధ్యక్షురాలు కోటగిరి శైలజ, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.