ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఏరియా-1ఇల్లందు క్లబ్ లో గురువారం 19వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం జరిగింది.ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లా గౌడ్ అధ్యక్షత వహించిన ఈసమావేశం లో ఆర్ జి వన్ జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గని ప్రమాదాలలో మరణించిన వారికి మౌనం పాటించారు.రక్షణ గురించి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ఏరియా సేఫ్టీ అధికారి సాయి ప్రసాద్ గత 18వ రక్షణ సమావేశ మినిట్స్ పై ఏరియాలో రక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ లు,అన్ని గనుల మేనేజర్లు,రక్షణ అధికారులు రక్షణ పై చర్చించారు. నాగేశ్వరరావు నామవరపు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ,(మైనింగ్) హైదరాబాద్ రీజియన్ నెం.2 (ఎస్ సి జెడ్),రాజ్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ,(ఎలక్ట్రికల్) హైదరాబాద్ రీజియన్ నెం.2 ఎల్‌వి సూర్యనారాయణ డైరెక్టర్ (ఆపరేషన్),చింతల శ్రీనివాస్ జిఎం (సేఫ్టీ),దిలీప్ కుమార్ డిడిఎంఎస్ (మెకానికల్) రాజీవ్ ఓంప్రకాష్ వర్మ డిడిఎంఎస్ (ఈ ఎల్ ఈ),కనకం ప్రేమ్ కుమార్ డిడిఎంఎస్ (మైనింగ్),అనికేత్ సింగ్,డిడిఎంఎస్, జి ఎం ఆర్ జి వన్ డి.లలిత్ కుమార్,ఎస్.మధు సూధన్ రీజినల్ లు జిఎం (భద్రత), కె.శ్రీనివాస్ రెడ్డి, జిఎం (రెస్క్యూ),యూనియన్ ప్రతినిధులు,పి సి పటేల్ జి ఎం ఎం సి ఓ జె ఎం ఎస్ అన్ని యూనియన్ ప్రతినిధులు కాంట్రాక్టర్ ప్రతినిధులు అన్ని గనుల ఏజెంట్లు ప్రాజెక్టు ఆఫీసర్స్, శాఖధిపతులు, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూపు ఇంజనీర్స్, రక్షణ అధికారులు,పిట్ ఇంజనీర్స్,వర్క్ మెన్ ఇన్స్ పెక్టర్స్, ఏరియా స్టక్షర్ కమిటీ సభ్యులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతినిధులు, యూనియన్ నాయకులు గనుల పనితీరు రక్షణపై తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరించారు.జియం కమిటి సభ్యులు రక్షణ విషయంలో ఏమి చేయలో సూచించారు.అనంతరం డి ఎం ఎస్,డిడిఎంఎస్ మాట్లాడుతూ గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలపై చర్చించి,గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. రక్షణతో కూడిన ఉత్పతి చేయాలని తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి సాయి ప్రసాద్,పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఎజెంట్స్ చిలుక శ్రీనివాస్, ఎల్ రమేష్, పివో రమేశ్, ఏరియా, యస్ఓటు జియం ఆంజనేయ ప్రసాద్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
