Take a fresh look at your lifestyle.

సింగరేణి ఏరియా జీఎం దంపతులకు సన్మానం

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం రెండవ ఏరియా అధికారులు గురువారం ఏరియా జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం జీఎం వెంకటయ్య, ఆయన సతీమణి వనజ వెంకటయ్య దంపతులు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాలకు వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించి, దైవదర్శనాలు చేసుకున్నారు.తదనంతరం ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం దంపతులు కేక్ కట్ చేయగా, ఏరియా స్తాయి అధికారులు, కార్యాలయం సిబ్బంది జీఎం దంపతులకు శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ జన్మ దిన వేడుకల్లో ఏరియా ఇంజినీర్ సుజన్ మెహ్రా, ఏరియా అఫిషియేటింగ్ ఎస్ఓ టు జిఎం ఎస్. సంతోష్ కుమార్, ఓసిపి-3 ప్రాజెక్టు అధికారి ఉదయ్ హరిజన్, డిజిఎం (సివిల్) ధనుంజయ, డిజిఎం పర్సనెల్ & అధికార ప్రతినిధి పి. అరవింద్ రావ్, ఓసిపి.3 ప్రాజెక్ట్ ఇంజినీర్ రాజాజీ, డీజీఎం (ఫైనాన్స్) వెంకట రామచంద్ర, ఎస్ఇ (పర్చేజ్) పండరీనాధ్, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, సీనియర్ (ఎస్టేట్స్) అధికారి జే. సునీతా, పర్యావరణ అధికారి వేణు కుమార్, డిప్యూటి పర్సనల్ మేనేజర్లు వేణు గోపాల్, వంశీధర్, ఐటి ప్రోగ్రామర్ అశ్వనీ, కార్మిక నాయకులు జిగురు రవీందర్, బి. శంకర్ నాయక్, కె. రాజరత్నం, ఎల్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.