ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
భారత మార్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సి పి ఐ యు .పోలిట్ బ్యూరో .కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 22 నుండి 24 వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ రాష్ట్ర రాజధాని కిసాన్ భవన్లో నిర్వహిస్తున్నట్లు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న అన్నారు.
ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పత్రిక విలేకరుల సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులను ఐక్యం చేసి రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావలసిన అవసరం ఉందని వెంకన్న అన్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ ముఖ్య అతిథిగా హాజరైతున్నారని. జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించడం జరుగుతుందని. ఈ సమావేశాలకు 16 రాష్ట్రాల నుండి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు. కేంద్ర కమిటీ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కాటం నాగభూషణం. హాజరైతున్నారని వెంకన్న తెలిపారు