- మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష.
- ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేష్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదని జగిత్యాల ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేష్ అన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒ వ్యక్తికి 5 రోజులు జైలు శిక్ష పడినట్లు ఎస్ ఐ తెలిపారు.జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేష్ ఆద్వర్యంలో పోలీసులు కొత్త బస్టాండ్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరంకు చెందిన దేవాండ్ల శ్రీధర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టు పడగ అతని పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ జి. కరుణాకర్ ఎదుట హాజరుపరుచగ అతనికి 5 రోజులు జైలు శిక్ష విధించారు.ట్రాఫిక్ ఎస్.ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వలన వారు ప్రమాదాలను ఎదుర్కొనడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం జరుగుతుందని, దీనిని తీవ్రంగా పరిగణిస్తూ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని సూచించారు.
