Take a fresh look at your lifestyle.

అంబేడ్క‌ర్ భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తి చేయాలి

  • డి. సీతారాం ధూళిపాళ.

గండిపేట్ ముద్ర విలేకరి: మ‌ణికొండ మున్సిపాలిటీలో మహనీయుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని మణికొండ మునిసిపాలిటీ బీఆర్ఎస్‌ పార్టీ స్థానిక అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆయ‌న మాట్లాడుతూ.. అంబేడ్క‌ర్ పేరు మీద‌ భవన నిర్మాణానికి గ‌త ప్రభుత్వ హయంలో 2019 సంవత్సరంలో 45 లక్షలు విడుదల చేయడం జ‌రిగింద‌న్నారు.ఆ నిధులు ఎక్క‌డ‌కు పోయాయో తెలియజేయాల‌ని, పుప్పాలగూడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టడం లేదనీ గడచిన ఆరు నెలల్లో పలుమార్లు మణికొండ మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్, సిడిఎంఏ, జిల్లా కలెక్టర్ ల దృష్టికి తీసుకెళ్లామ‌న్నారు.అయినా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవన్నారు.ఈ రకమైన అవమానకర చర్యలను నిరసిస్తూ వచ్చే వారం మున్సిపల్ ఆఫీసులో బిఆర్ఎస్ పార్టీ తరపున పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు.ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే భ‌వ‌న నిర్మాణం చేప‌ట్టాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ల ధనరాజ్, ప్రధాన కార్యదర్శి గుట్టమీది నరేందర్, మహిళా అధ్యక్షురాలు పట్లోళ్ల రూపారెడ్డి, జై భీమ్ అభిమానులు, బిఆర్ఎస్ పార్టీ స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.