Take a fresh look at your lifestyle.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు బేష్ : సర్పంచ్ జనగాం పాండు

రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు బేష్ అని తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామంలో భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -I వాలంటీర్స్ జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరంలో భాగంగా రెండవ రోజు పచ్చదనం పరిశుభ్రతలో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు. గ్రామపంచాయతీలోని 1,2 వార్డులలో చెత్త సేకరణ, స్కూలు ఆవరణలో చెత్త సేకరణ, శివాలయంలోని మట్టి తీసివేత వంటి కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ తోటకూరి రామకృష్ణ, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నల్లమాస సత్యనారాయణ గౌడ్, వార్డు మెంబెర్స్ జనగాం ఇందిరమ్మ, రత్నాపురం శ్రీకాంత్ ,జనగాం మహేష్, రాసాల శరత్ యాదవ్, ముంత కృష్ణవేణి, రమేష్, దొమ్మటి భాగ్య లక్ష్మి, దేవేందర్ ఎల్లకొండ, అలివేలు రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు రత్నపురం పురుషోత్తం, జనగాం మహేష్, రాసాల రాజు యాదవ్, రాసాల క్రాంతి యాదవ్, మాకొలు భాను యాదవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.