Take a fresh look at your lifestyle.

కాళీయమర్దన అలంకార సేవలో యాదగిరి నారసింహుడు.

 

ముద్ర, యాదగిరిగుట్ట :

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం ప్రధాన ఆలయ మంటపంలో స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని యాగశాల ప్రవేశం చేసి ద్వారా తోరణ పూజ మూర్తి కుంభారాధన చతు స్థానార్చన నృసింహ లక్ష్మీ సుదర్శన శతకం గరుడ మూల మంత్రం హోమములు నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి కాళీయ మర్దన అలంకార సేవను నిర్వహించి ఆలయ తిరు మాడవీధుల్లో ఊరేగుతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం యాగశాలలో సాయ మారాధన నిత్య హవనము లక్ష్మీ నృసింహ సుదర్శన మూల హోమములు నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు అర్చకులు సందీప్ కుమార్ చార్యులు అరుణ్ కుమార్ చార్యులు ఏఈఓ శంకర్ నాయక్ ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు దేవస్థాన సిబ్బంది కుమార్ సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.