Take a fresh look at your lifestyle.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శం

తుంగతుర్తి లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

* గ్రామ గ్రామాన రెపరెపలాడిన గులాబీ జెండా

ముద్ర, తెలంగాణ…

తెలంగాణ ఆత్మ గౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు అని, అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీది అని ఆ పార్టీ తుంగతుర్తి మండల కమిటీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో మండల కమిటీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య గులాబీ జెండా ఎగరవేయగా,మండల పరిధిలోని అన్ని గ్రామ స్థాయిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు గులాబీ జెండాను ఎగర వేసి పార్టీ ఆవిర్భావాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ నాయకత్వానికి మద్దతు తెలిపారు. గ్రామాల్లో పలుచోట్ల కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తల నినాదాలతో ఊరంతా సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ….2001 ఏప్రిల్ 27 న కేసీఆర్ ఎగర వేసిన గులాబీ జెండా నేడు తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా నిలిచిందన్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత, రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్‌ ను స్థాపించారన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందన్నారు.అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేసినట్లు తెలిపారు. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ చూసిందనీ,రాష్ట్రం సిద్ధించాక కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమైందన్నారు. 10 ఏళ్లల్లో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించిందనీ,ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
ఇప్పటికీ కేసిఆర్ మీద నమ్మకం ఉందనీ,కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తాం అని ఆశ భావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జెండా మోసిన కార్యకర్తలకు పాధాభివందనం అన్నారు. అమరవీరుల త్యాగం మరువలేనిదనీ,వారి ఆకాంక్షల సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, దొంగరి శ్రీను, తునికి సాయిలు, మహిళా మండల కమిటీ అధ్యక్షురాలు తునికి లక్ష్మి,బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు కుంచాల శ్రీనివాసరెడ్డి, తప్పట్ల ఎల్లయ్య, చింతకుంట్ల మనోజ్, మేడుదుల రమేష్, మాతంగి వెంకటమ్మ కరుణాకర్, మల్యాల రాములు, గాజుల యాదగిరి, గుండ గాని దుర్గయ్య, కొండగడుపుల నాగయ్య, గొపగాని రమేష్, తడకమల్ల రవికుమార్, గొప్పగాని శ్రీను, రవి నాయక్, రచ్చ నవిన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.