Take a fresh look at your lifestyle.

ఉమ్మడి ఆదిలాబాద్ ఇందిరమ్మ ఇళ్ల పై మంత్రుల సమీక్ష

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఎంపీలు నగేష్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్ బాబు పాల్గొన్నారు. అలాగే రెవిన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, భవేశ్ మిశ్రా, కుమార్ దీపక్, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.