Take a fresh look at your lifestyle.

వడాయిగూడెం భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సర్వే నంబర్ 518 భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ సోమవారం హైదరాబాద్‌లోని మల్లన్న ని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని సర్వే నంబర్ 518 భూములకు సంబంధించిన వివాదాలపై ఆయనకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
సర్వే నంబర్ 518లో కేవలం 20 ఎకరాల భూదాన్ భూమి ఉంటే మొత్తం 467 ఎకరాలను నిషిద్ధ జాబితాలో పెట్టడం వల్ల రైతులు, సామాన్యులు ఇబ్బందులను వివరించారు. జనావాసాలు ఉన్న ప్రాంతాలను కూడా బ్లాక్ చేయడం వల్ల ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తీన్మార్ మల్లన్న స్పందిస్తూ భూభారతి లోపాలు, రెవెన్యూ అధికారుల పొరపాట్ల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడటం అన్యాయమని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుక్కల దుర్గయ్య యాదవ్, ఉమ రమేష్, కోట దీప, కోట సుధాకర్, కోట సుధావాణి, గ్రామ నాయకులు బబ్బూరి సాగర్ గౌడ్, రాసాల రాజు యాదవ్, బొజ్జ సాంబేష్, నీల మనీష్ గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.