- చట్ట వ్యతిరేక పనులు చేస్తే చర్యలు తప్పవు.
- గోదావరిఖని I టౌన్ ఇన్స్పెక్టర్ ఏ.ఇంద్రసేనారెడ్డి.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 18న ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్ లో వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారస్థులకు ఫోను చేసి ఒక్కొక్కరు తలా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.అంతేకాకుండా గత కొంత కాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యాపారులను బెదిరించాడు.అట్టి ఫోను బెదిరింపులతో భయపడిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళనలకు గురై జూలై 22 న ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై కె.రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారని గోదావరిఖని వన్టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.సదరు వ్యాపారి దరఖాస్తులో అతనిని బెదిరించిన వ్యక్తి ఫోన్ నెంబర్ తెలుపగా ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరిఖని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతనిని గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ కి చెందిన యాదనవేని తిరుపతి గా గుర్తించి మంగళవారం అరెస్టు చేసి అతని వద్ద బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని ఒకవేళ అలాంటి పనులు చేసినట్ల యితే వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,ఎస్సై రమేష్, సిబ్బంది ఉన్నారు.