Take a fresh look at your lifestyle.

తెలంగాణ సాహితీ శిఖరం సినారె

  • కళాశ్రీ అధినేత గుండేటి రాజు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ సాహితీ శిఖరం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు మాట్లాడుతూ సి నా రే సాహిత్యం ముందు తరాలకు ఆదర్శమని, నాడు సినీ గీతాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్ల గొట్టిన మధుర గీతాల రచయిత సి నా రే అని కొనియాడారు. సి నా రే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కవులు సి నా రే సాహిత్యం పై కవితాగానం ఆలపించారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ప్రధాన అడ్మిన్ అయిత అనిత, లక్కారాజు శ్రీలక్ష్మి, ములస్తం లావణ్య, మద్దెల ప్రభాకర్, ఓదెల గంగాధర్, సవిత కంకటి, రుద్రాంగి రాధ, రుద్రాంగి రమాదేవి, రుద్ర మాణిక్యం, డాక్టర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.