Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

 

ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, చైర్మన్ కోమటీ రెడ్డి నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం లొ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షులు ఎలుక ఆంజనేయులు ,కార్యనిర్వహక అధ్యక్షులు సుద్దాల లక్ష్మణ్, కాడే శంకర్, దామెర సత్యం, బోలుమల్ల సదానందం, ఈసరి రవికిరణ్, గంటల రేణుక, కొండ్రా స్వరూప, గోసికి అజయ్, గజ్జల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.