Take a fresh look at your lifestyle.

నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

ముద్ర,వీపనగండ్ల: నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా నిలుస్తాయని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో మరియు గ్రామాలలో దాతలు, ప్రజల భాగస్వామ్యంతో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, కంట్రోల్ పాయింట్లను శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రావుల గిరిదర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని,వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని అన్నారు.అనేక కేసులును ఛేదించడంలో,దొంగతనాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో చాలా కేసులలో యాక్సిడెంట్ చేసి పారిపోయే వాహనాలను గుర్తించే అవకాశం సైతం సిసి కెమెరాలతో కలుగుతుందన్నారు.శ్రీరంగాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను సహకరిస్తూ ప్రతి గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు.శ్రీరంగాపూర్ ఎస్సై రామకృష్ణ చొరవ, ప్రత్యేక కృషితో పాటు గ్రామస్తులకు సిసి కెమెరాల ఏర్పాటు పట్ల.అవగాహన కల్పించి చైతన్యం చేయడం ద్వారా ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించి ఆర్థిక సహాయం చేసిన దాతలను జిల్లా ఎస్పీ గశాలువాతో సన్మానించారు.కార్యక్రమంలో కొత్తకోట సిఐ,రాంబాబు,శ్రీరంగాపూర్ ఎస్సై రామకృష్ణ,స్నేహ ఫౌండేషన్, రామేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సింగల్ విండో చైర్మన్ జగన్నాథం నాయుడు, రైస్ మిల్ ఓనర్స్ వెంకటేశ్వర్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి ప్రభాకర్ నారాయణ వివిధ పార్టీల నాయకులు శ్రీహరి రాజు,మహిరుద్దీన్, మాజీ ఎంపీటీసీ ఎల్లస్వామి, రామేశ్వర్ రెడ్డి, రాముడు, గంగాధర్, రాధాకృష్ణ,గ్రామ ప్రజలు,యువత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.