Take a fresh look at your lifestyle.

ఆందోల్ విద్య, వైద్య రంగాల హబ్ గా గుర్తింపు : మంత్రి దామోదర్

ఆందోల్ నియోజకవర్గం లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు ఏర్పాటు కు కృషి.

సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఆందోల్ నియోజకవర్గానికి మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి .

*RRD డిస్టలరీ ప్రారంభోత్సవం లో మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి *

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి :

ఆందోల్ మండలం లోని పోసానిపేట్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన RRD డిస్టలరీ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఆందోల్ నియోజక వర్గాన్ని ఎడ్యుకేషనల్, హెల్త్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 40 వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మరో లక్ష ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

అలాగే, నిరుద్యోగులకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. RRD డిస్టలరీ ని ఏర్పాటుచేసిన యాజమాన్యాన్ని అభినందించారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలించారు . పరిసర ప్రాంతాలలో ఉన్న వారికి ఈ పరిశ్రమలో ఉపాధి కల్పించడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ పరిశ్రమ మరింత విస్తరించి రానున్న రోజుల్లో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహద పడాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అందులో నియోజకవర్గం పరిశ్రమలో ఏర్పాటుకు అనువైన ప్రదేశమని నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి తన వంతు సహాయ సహకారాల అందించి పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, RRD డిస్టలరీ MD కొండల నిపుణ్ రెడ్డి, కంపెనీ డైరెక్టర్ త్రిష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందోల్ జగన్మోహన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, బండ అభిలాష్ రెడ్డి తీగల నర్సిరెడ్డి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ కి చెందిన పలువురుల కౌన్సిలర్ తోట్ల రామకృష్ణ, మాజీ కోఆప్షన్ సభ్యులు శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్ శంకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివరాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేషరెడ్డి స్థానిక మాజీ కౌన్సిలర్ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.