- వేడుకల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధానంలో రెండవ రోజు పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు ఉపవిషత్తు పారాయణం,వేదపఠనము, మూలవిరాట్టుకు పంచామృత అభిషేకము,మంత్రపుష్పం,శాత్తుమొర, తీర్థప్రసాద వితరణ.సాయంత్రం శ్రీ లక్ష్మీసహస్రనామ పారాయణము,కుంకుమార్చన, ఓడిబియ్యము,శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, మూలమంత్ర హవనం, పవిత్రలకు శయ్య, ఫల,పుష్పాధివాసము,బలిహరణం,నివేదన,మంత్రపుష్పము,తీర్థప్రసాద వితరణ. కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేదపండితులు ఘనంగా నిర్వహించారు.రాత్రి వేళల్లో భక్తులు సామూహిక భజనలు, రామనామ సంకీన్తనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్, బత్తిని శ్రీనివాస్ మల్లేశ్వరి,దారం ఆదిరెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, ముత్యం శంకర్ గౌడ్, శనిగారపు తిరుపతి, హరినాథ్, సతీష్ రెడ్డి, వోల్లాల మల్లేశం, బివి రమణ, ముద్ధం శ్రీనివాస్, మర్రి లక్ష్మణ్, దూడం రామాంజనేయులు, బండి రవి, నక్క అనిల్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.
