Take a fresh look at your lifestyle.

ఘనంగా రంజాన్ వేడుకలు మెదక్ ఈద్గా వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం, నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్, రామాయంపేటతో పాటు మండల కేంద్రాలు, ముస్లిం సోదరులున్న గ్రామాల్లో వేడుకలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో శనివారం ఉదయం కొత్త బట్టలు ధరించి ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి నొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


ఈద్గా వద్దకు ఎమ్మెల్యే రోహిత్
మెదక్ పట్టణంలోని నవాబుపేట ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ అల్లా సందేశం వినిపించారు. ఎమ్మెల్యే రోహిత్ ముస్లిం సోదరులతో కలిసి ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ పండుగను జరుపుకోవడం సంతోషకరం అన్నారు. ఈద్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి వసతులు కల్పించడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ కౌన్సిలర్ దొంతి లక్ష్మి ముత్యంగౌడ్, మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు మన్సుర్, హరిత, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నర్సాపూర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు.


బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు
రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలోని నవాబ్‌పేట్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. వెంట అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.