ముద్ర, తెలంగాణ బ్యూరో : సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వారం రోజుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 11 నుంచి 17 వరకు పాఠశాలలకు, ఈనెల 11 నుంచి 16 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులను ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ఈనెల 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా, తాజాగా రెండు రోజులు ముందుగానే సెలవులను ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.