ముద్ర, తాండూర్.
అత్యవసర పరిస్థితిలో తాండూర్ నియోజకవర్గ ప్రజలకు చేయూతనందించే ఆపద్బాంధవుడు, ప్రాణప్రయ స్థితిలో నుంచి తాను రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన దయ హృదయముడు డాక్టర్ సంపత్ కుమార్. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్. ఆదివారం రోజున తాండూర్ మండలం కోతల పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భవతితో కడుపులో తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా మారింది.దీంతో కుటుంబీకుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ ఆ మహిళకు ఓ నెగటివ్ రక్తం దానం చేసి ఆ గర్భవతికి పునర్జన్మను ప్రసాదించారు. దీంతో కుటుంబీకులు డాక్టర్ సంపత్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటివరకు165 సార్లు రక్తం దానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ సంపత్ కుమార్ ను తాండూర్ నియోజకవర్గ ప్రజలు ఆపద్బాంధవుడుగా పేర్కొంటారు.