-ఐదో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
విద్యుత్ ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదాని రాష్ట విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్సేన్ సాహెబ్ అన్నారు. ఆదివారం వికారాబాద్ లోని డివిజన్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు ఆయన హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరుకింది. ఐదు రోజుల నుంచి విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న యజమాన్యం ప్రభుత్వం విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. నిన్న శనివారం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు విద్యుత్ ఆర్టిజర్ ఎంప్లాయిస్ చలో పాల్వంచ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న మా తోటి ఆర్టిజన్ కార్మికులను అక్కడికక్కడే చెక్ పోస్ట్ లు పెట్టి మధ్యలో పోలీసులు అరెస్టులు చేయడం ఏమిటి ఆయన ప్రశ్నించారు. మాకు ఏపీ ఎస్ఈబి సర్వీస్ రూల్స్ వచ్చేంతవరకు మా సమ్మె కొనసాగుతుందన్నారు. సమ్మె ఇంకా ఉద్ధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా యజమాన్యం ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వం యజమాన్యం ఇప్పటివరకు చర్చలకు పిలవకుండా ఇలా కాలయాపన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఈ సమ్మె ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం తప్పకుండా ఉంటుందన్నారు.
2026 పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు , అక్బర్ బాబా, వాజిద్, ఖాజా ఫాష, సర్కిల్ నాయకులు
మహేష్, బాల్ రాజు, అక్తర్ అలి, శేఖర్, మెమిన్ , వెంకటయ్య, సతిష్, ఆంజనేయులు, శ్రీశైలం, అమీద్, పరామేష్ ,సంతోష్. ప్రసాద్, రాజ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, సురేష్, విజయ్ వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.