Take a fresh look at your lifestyle.

భాజపాను సంస్థాగతంగా పఠిష్టం చేయాలి

  • హైదర్ నగర్ డివిజన్ సమావేశంలో రవికుమార్ యాదవ్.

మాదాపూర్, ముద్ర విలేఖరి: ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మారబోయిన రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని నా వంతు తోడ్పాటును అందిస్తానని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,నియోజకవర్గ ఇన్చార్జి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. హైదర్ నగర్ డివిజన్ నూతన కార్యవర్గ సమావేశం ఆదిత్య నగర్ కమ్యూనిటీ హాలునందు డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ అద్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవికుమార్ యాదవ్, డివిజన్ ఇంచార్జి బుచ్చిరెడ్డి, కో- కన్వీనర్ మణి భూషణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు మరియు డివిజన్లో ఉన్న సీనియర్ నాయకులు పాత ,కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ స్థానిక సమస్యలపై దృష్టి సారించి, రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రవి కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా డివిజన్లో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు శూన్యం గతంలో బిఆర్ఎస్ పార్టీ అవలంబించిన తీరుగానే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని, పేద ప్రజలకి, నిరుద్యోగులకు, మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అర్థమయ్యే రీతిలో తెలియపరచాలని కోరుతూ 11 సంవత్సరాల పాలనలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాయంలో పొందుతున్నటువంటి లబ్ధిని, అభివృద్ధిని కరపత్రాల ద్వారా గడపగడపకు తీసుకువెళ్లి, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరూ కంకణాబద్ధులై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శులు ,ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, బూత్ స్థాయి నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, జిల్లా ,రాష్ట్ర స్థాయి నాయకులు, మహిళా మోర్చా, యువ మోర్చా మరియు నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.గురుపౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొన్న రవికుమార్
ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు ఆల్విన్ కాలనీ డివిజన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు ఆధ్వర్యంలో ఎస్.ఎస్.డి గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ గురుపౌర్ణమి వేడుకలు మరియు హఫీజ్ పేట్ డివిజన్, హుడా కాలనీ లోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కంటేస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్ మరియు బీజేపీ మహిళా మోర్చ పార్లమెంట్ కో కన్వీనర్ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణం మరియు ఆషాఢమాస గోరింటాకు సంబరాలలో పాల్గొన్న గురువులను సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు చిన్నతనంలో అన్ని నేర్పే గురువులుగా తల్లిదండ్రులు, తర్వాత చదువు , విజ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులు ఇలా వారు మాత్రమే కాకుండా జీవితంలో మంచిగా ఉండడం, సన్మార్గంలో నడవడం, ఉన్నత శిఖరాలకు అధిరోహించడంలో మనకు ఎల్లప్పుడూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరు గురువుతో సమానమే , మనం ఈరోజు అలాంటి వారిని సన్మానించుకుని వారికి మన కృతజ్ఞతలు తెలుపుతుంటాం ఎందుకంటే గురువు దేవుడితో సమానం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజవర్గ, డివిజన్, మహిళా మోర్చ, నాయకులు, కార్యకర్తలు తదితరుకు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.