Take a fresh look at your lifestyle.

హింసకు తావు లేదు !

  • దానికి కాంగ్రెస్​ వ్యతిరేకం.
  • మావోయిస్టులు శాంతి చర్చలు.
  • ప్రాణనష్టం జరుగకుండా శాంతిభద్రతలు కాపాడుకోవాలి.
  • మావోయిస్టుల మందుపాతరకు శ్రీధర్​ బలి కావడం దురదృష్టకరం = మృతుడి కుటుంబానికి రూ. 2.17 కోట్ల పరిహారం.
  • 900 గజాల స్థలం.
  • ఆపరేషన్​ కగార్​ హింస లేకుండా ఉండాలి.
  • మంత్రి పొన్నం ప్రభాకర్.​

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: హింసకు తావు లేదని, దానికి కాంగ్రెస్​ వ్యతిరేకమని, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుతామని, ప్రాణనష్టం జరుగకుండా శాంతిభద్రతలు కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ కి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి ఆయన శుక్రవారం కామారెడ్డిలో నివాళులు అర్పించారు. మంత్రి తో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ఎంపీ సురేష్​ షెట్కర్​, ఎమ్మెల్యే మదన్ మోహన్ , జిల్లా యంత్రాంగం నివాళి అర్పించారు.గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు.శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సినవి అన్ని అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన వడ్ల శ్రీధర్ 2020 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో బాగంగా ములుగు జిల్లా కర్రెగుట్టల్లో పోరాటంలో మరణించడం జరిగిందన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరుపున ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు.కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబం ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామన్నారు.ముఖ్యమంత్రి గఆదేశాలతో ప్రభుత్వం నుండి నేను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వచ్చామన్నారు.ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇలాంటి ఘటనలు సహించేది లేదని అన్నారు.హింసకు తావు ఉండదని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, మావోయిస్టులు చేస్తున్న కార్యక్రమాలు అయిన హింసకు తావు ఉండద్దన్నారు. హింసకు పాల్పడితే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ఎవరు అంగీకరించరని, హింస కు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు.మావోయిస్టులు సైతం శాంతి యుత చర్చలు అని ప్రకటించారని,కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు. ప్రాణనష్టం జరగకుండా శాంతి భద్రతలు కాపాడుకోవాలని అన్నారు.

ముఖ్యమంత్రి పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన శాంతియుతంగా ఉండాలని కోరామన్నారు.మాజీ మంత్రి జానారెడ్డి , కేశవరావు తో కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందన్నారు.శాంతి భద్రతలు కాపాడడానికి చనిపోయిన వారికి కుటుంబ ప్రజా 2.17 కోట్లు పరిహారం,900 గజాల స్థలం,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్ కగర్ ప్రాణాలు హింస లేకుండా ఉండాలన్నారు.చర్చలకు సంబంధించి గతంలో చర్చలకు నాయకత్వం వహించిన జానారెడ్డి గారు లాంటివారితో అనుభవం ఉందన్నారు. ప్రభుత్వం పరంగా కేంద్రం రాష్ట్రం శాంతి భద్రతలు సంబంధించి ఏ మార్గం వహిస్తే బాగుంటుందని సమస్య పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని అన్నారు.ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చేది లేదని అన్నారు.శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.