Take a fresh look at your lifestyle.

మొయినాబాద్ కన్నుల పండువగా రంజాన్ వేడుకలు.. భక్తిశ్రద్దలతో ముస్లింల ప్రార్ధనలు

  • ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు.
  • మొయినాబాద్ సీ ఐ పవన్ కుమార్ రెడ్డి కి శాలువా పూల మాలతో సత్కారం చేసిన ముస్లిం సోదరులు.

ముద్ర, మొయినాబాద్ : రంజాన్ పవిత్ర మాసంలో నెల రోజుల పాటు ఉపవాస్య దీక్షలు చేపట్టిన ముస్లీంలు రంజాన్ పండుగతో దీక్షలు విరమించారు. సోమవారం రంజాన్ పండుగను ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటి కేంద్రంలోని ముస్తాఫా హిల్స్లో గల ఈద్గా వద్దకు ముస్లీం సోదరులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ముస్లీం సోదరులు చేరుకుని అర గంట పాటు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ఇమామ్లు మతపరమైన బోధనలు చేశారు.ప్రార్ధనలు ముగిసిన తరువాత ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదే విధంగా ఈద్గా వద్దకు చేరుకున్న హిందువు, క్రైస్తవ సోదరులు సైతం ముస్లీంలకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డికి, బీఆర్ఎస్ నాయకులు షేక్ మహాబూబకు, సురేందర్ గౌడ్కు, టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్కు సన్మానం నిర్వహించారు. అదే విదంగా హిమాయత్నగర్, సురంగల్, పెద్దమంగళారం, వెంకటాపూర్, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, చిన్నమంగళారం, ముర్తుజాగూడ, ఎల్కగూడ, కుతుబుద్దీన్జూడ గ్రామాల్లో ముస్లీం సోదరులు రంజాన్ వేడుకలను భక్తి శ్రదలతో నిర్వహించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.