Take a fresh look at your lifestyle.

భారత కార్మిక ఉద్యమాల వేగుచుక్క కామ్రేడ్ బి టీ రణదీవే-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్

 

ఆయన స్ఫూర్తితో సమరశీల ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

భారత కార్మిక ఉద్యమ నిర్మాత, కార్మిక వర్గ ఉద్యమ వేగుచుక్క బి టి రణదీవే అని ఆయన స్ఫూర్తితో సమరశీల పోరాటాలు నిర్మిస్తామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ అన్నారు. సోమవారం బాలచంద్ర త్రయంబక రణదీవే 36వ వర్ధంతి కార్యక్రమం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేశారు. అనంతరం మాట్లాడుతూ భారత కార్మికు ఉద్యమ నిర్మాతల ఒకరు బి టి రణ దివే 1904 డిసెంబర్ 19న మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించి 1990 ఏప్రిల్ 6న మరణించారన్నారు. ఆయన ఆనాడే బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో ముందు బాగా నిలిచి పోరాడారని బ్రిటిష్ కాలంలోనే బొంబాయి ప్రాంతంలో కార్మిక సంఘాల స్థాపించి అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. మొట్టమొదటిగా భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ను ఏర్పాటు చేసి 1970 సిఐటియు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కార్మికుల ప్రయోజనాలు తప్ప సొంత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్ధమైన కార్మిక నాయకుడని వారు అన్నారు. 1931లో గాంధీజీ బొంబాయిలో జరుగుతున్న ఒక బహిరంగ సభలో ధైర్యంగా భగత్ సింగ్ రాజ్ గురు లకు మీరట్ కుట్ర వేసి ఉరి శిక్ష వేసిన సందర్భంలో ఆ అంశంపై నిలదీశాడు. 1974 రైల్వే కార్మికుల పోరాటాన్ని సమన్వయ కమిటీ నాయకత్వం వహించి వారికి అండగా నిలబడి హక్కుల సాధన కోసం పోరాడారు. 1982లో మొట్టమొదటి దేశవ్యాప్త సమ్మె జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు కార్మికుల యొక్క ప్రాధాన్యతను గుర్తించే ఐక్యం చేసే దానికోసం శత్రువర్గంపై పోరాటం చేశారు సంస్కరణ వాద కార్మిక సంఘాలలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి కార్మిక హక్కులకు భంగం వాటిల్లకుండా ట్రేడ్ యూనియన్ తమ ప్రాధాన్యతను గుర్తించి కార్మిక వర్గ హక్కుల కోసం తన జీవితకాలం కృషి చేశాడని తెలిపారు. కార్మికుల కోసమే కాకుండా రైతాంగం, వ్యవసాయ కార్మికుల ఉపాధ్యాయ, మధ్యతరగతి ప్రజల దేశంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి బీటీ రణ దేవి అని ఆయన ఆశయాల కోసం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పైన కార్మిక వర్గం ఐక్యంగా విశాల ఉద్యమాలు నిర్మించ డమే నిజమైన నివాళులర్పించడం అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడాల కనకయ్య ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి ఎలక్ట్రిసిటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ర్యాకం అశోక్ యూనియన్ నాయకులు కనకరాజు, విష్ణువర్ధన్ మున్సిపల్ యూనియన్ నాయకులు రాజయ్య సత్యం మహేష్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింతల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.