Take a fresh look at your lifestyle.

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం

  • రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల భావి చౌరాస్తా సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో ప్రభత్వ విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అధికారులు, పుర ప్రముఖులు దళిత నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన అత్యంత కాలం కేబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత గల నేత మాత్రమే కాకుండా, భారత మాజీ ఉప ప్రధాన మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసి గ్రీన్ రివల్యూషన్‌ను అమలు చేశారని, రక్షణ మంత్రిగా ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారతదేశా విజయంలో, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో ఆయన పాత్రను మరువలేమని అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషి సమాజానికి దిశానిర్దేశకంగా నిలిచాయని అన్నారు.జిల్లా అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ఆర్డీవో మధుసూదన్, డిఎస్పి రఘు చందర్, మున్సిపల్ కమిషనర్ స్పందన, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘ, వివిధ సంఘాల నాయకులు, పేట భాస్కర్, బంగారు దీపక్, బొల్లి శేఖర్ , బెజ్జంకి సతీష్, బొల్లె గంగారం మాజీ సర్పంచ్, మకిలి ఇజ్రాయిల్, దర రమేష్ బాబు, భువనగిరి నారాయణ, బోనగిరి దేవయ్య, నక్క జీవన్, మేకల పవన్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.