Take a fresh look at your lifestyle.

అక్కనపేట – మెదక్ కొత్త రైల్వేలైను విద్యుదీకరణ పూర్తి

ముద్ర, తెలంగాణ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వేలోని అక్కనపేట – మెదక్ కొత్త రైల్వే లైన్ విద్యుదీకరణ పూర్తి అయ్యింది. మిషన్ విద్యుదీకరణకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ హైదరాబాద్ డివిజన్ కొత్తగా నిర్మించిన అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్‌ను రూ. 15.49 కోట్ల వ్యయంతో 18.56 ట్రాక్ కిలోమీటర్ల దూరానికి విద్యుదీకరణ పనులు పూర్తి అయి వినియోగంలోనికి వచ్చింది. డివిజన్‌లోని మొత్తం ట్రాక్ కిలోమీటర్ల విద్యుదీకరణ ఇప్పుడు 1,004 టికిమీలకు చేరుకుంది. ఇటీవల నిర్మించిన మనోహరాబాద్- సిద్దిపేట రైలు మార్గం మినహా ఈ డివిజన్ 100% విద్యుదీకరణను సాధించింది.

Leave A Reply

Your email address will not be published.