Take a fresh look at your lifestyle.

తిమ్మాజిపేటలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, తిమ్మాజిపేట

తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మండల స్థాయి కార్యాలయాల బలోపేతం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సేవలను సులభంగా పొందే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వివేక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామ్ రెడ్డి, హర్షవర్ధన్, లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.