ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి : మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి మండలం నందనం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులను తేమ పేరుతో, మాచర్ రావడం లేదని 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మి నారాయణ గౌడ్, మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నాగేల్లి గిరిజ రమేష్ గౌడ్, విఠల్ రెడ్డి, సాంబాంకరి వెంకటేష్, చింతల దేవేందర్ గౌడ్, కొండాపురం శ్రీనివాస్, మోలుగు నాగరాజు, చుక్క పద్మయ్య, ఉపసర్పంచ్ కాసాని శేఖర్ యాదవ్, రాసాల లింగ స్వామి యాదవ్, మధుసూదన్ రెడ్డి సురేష్, రైతులు పాల్గొన్నారు.