తుంగతుర్తి లో బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్దం
ముద్ర, తుంగతుర్తి…
హైదరాబాద్ లో మైనర్ బాలిక నునమ్మించి మోసం చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను తుంగతుర్తి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం దగ్ధం చేశాయి ఈ సందర్భంగా మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ వేధింపులకు గురి అయినటువంటి యువతి కి ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఉన్న చాటు మాటు రాజకీయ సంబంధం తో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసును నిరుగార్చాలని చూస్తున్నారని అన్నారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నిందితుడిని చట్ట పరిధిలో శిక్షించాలని డిమాండు చేస్తున్నామనీ అన్నారు మైనర్ బాలిక కు న్యాయం జరిగే బిఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు సోమేష్. రమేష్. లక్ష్మయ్య నాగమల్లు. వెంకటేష్ గోపగాని వెంకన్న లతీఫ్ చింతకుంట్ల సురేష్ కొల్లూరి మహేందర్. ఆకారపు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.