ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
SSC స్పాట్ మూల్యాంకన భత్యాలను పెంచాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ చేశాయి. ఈ మేరకు ధరూర్ లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో మంగళవారం నిర్వహిస్తున్న SSC స్పాట్ మూల్యాంకన కేంద్రం వద్ద టిటిజెఏసి, యుఎస్పిసి, జాక్టో రాష్ట్ర శాఖల పిలుపు మేరకు 2025 లో నిర్వహించిన ఎస్ఎస్సి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 2024 లో నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించిన రెమ్యునరేషన్ తక్షణమే చెల్లించాలన్నారు. గత 7 సంవత్సరాలుగా ఎస్.ఎస్.సి స్పాట్ రెమ్యునరేషన్ పెంపు జరగలేదని, అదే సమయంలో 10వ తరగతి మూల్యాంకన భత్యం కనీసం 50% పెంచాలని, ఈ సంవత్సరంలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టిన ఉపాధ్యాయులు, అనంతరం జిల్లా విద్యాధికారి రాము కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు బోయినిపెల్లి ఆనంద్ రావు, బైరం హరి కిరణ్, తిరుకోవెల శ్యాంసుందర్, యాల్ల అమర్నాథ్ రెడ్డి, గంగ నరసయ్య, తుంగూరి సురేష్, ఎన్నం రామరెడ్డి, బోగ రమేష్, భూమేష్ ,గుర్రం శ్రీనివాస్ గౌడ్, రామచంద్రం, గట్ల సంతోష్, జితేందర్ రెడ్డి, బన్న, విషప్రసాద్, వేల్పుల స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
