ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించాలి- ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.
మహాదేవపూర్, ముద్ర:
గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహను పెంపొందించాలని, వైద్యంతో పాటుగా నైతిక మద్దతును వారికీ అందించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చెల్పూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ పుప్పాల శ్రీనివాస్, కంప అక్షయ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, పి.హెచ్.సి వైద్యులు డాక్టర్ స్వాతి, న్యాయవాదులు మంగళంపల్లి రాజ్ కుమార్, దుప్పటి ప్రవీణ్, గ్రామ సర్పంచ్ రజిత తదితరులు పాల్గొన్నారు.