Take a fresh look at your lifestyle.

మిరప తోటలను సందర్శించిన శాస్త్రవేత్తలు యాజమాన్య పద్ధతులపై అవగాహన

 

మహాదేవపూర్, ముద్ర:

మిరప పంటలో దిగుబడి మరియు నాణ్యతను పెంచేందుకు సరైన పద్ధతుల్లో పంట అవశేషాల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, కీటక-వ్యాధి నియంత్రణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చులను తగ్గించి లాభాలను పెంచుకోవచ్చని సూచించారు. మహబూబాబాద్ జిల్లా, మల్యాల ఉద్యాన పరిశోధన కేంద్రాల నుండి శాస్త్రవేత్త మరియు హెడ్ డా. ఏ. అడ్లూరి ప్రశాంత్ కుమార్, చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో సాగవుతున్న మిరప తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా మిరప కోత అనంతరం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు విపులంగా వివరించారు. అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయంలో కూరగాయల వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి ఏ. సునీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రెడ్డి, ఉద్యాన అధికారి మణి, ఉద్యాన విస్తరణ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.