Take a fresh look at your lifestyle.

గిరిజన సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ కు సన్మానం

ముద్ర,అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ జిసిసి బ్రాంచ్ కు అకస్మికంగా వచ్చిన గిరిజన సహకార సంస్థ చైర్మన్ కోట్నాథ్ తిరుపతి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎం ఏ రహీం నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు రాజేంద్రప్రసాద్ చెంచు నాయకులు శంకరయ్య గోపాల్ నాయక్ తదితరులు చైర్మన్ ను శాలువాతో సన్మానించారు అలాగే సమస్యలు గత 20 సంవత్సరాల నుండి టెంపరరీగా పనిచేస్తున్న వారిని చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశారు అలాగే చైత్ర పౌర్ణమి కి సలేశ్వరం జాతరకు మూడు రోజులే కాల వ్యవధి ఇస్తున్నందున తొక్కిసలాటల లో భక్తులు చనిపోతున్నారని ఈ యొక్క టైంను పది రోజులుగా పొడిగించాల్సిందిగా చైర్మన్ తిరుపతిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలు చేయాల్సిందిగా చెంచు నాయకులు కోరారు ఎప్పుడో కట్టిన డిఆర్ డిపోలు వర్షాలకు కురుస్తున్నాయని అలాగే డిఆర్ డిపోలను మరమ్మత్తులు చేయించాలని ఒకప్పుడు గిరిజన సహకారక సంస్థకు ఉన్న కీర్తిని గౌరవాన్ని మళ్లీ తీసుకురావాలని చైర్మన్ కోటాక్ తిరుపతి కి విజ్ఞప్తి చేశారు అలాగే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావలసిన బెన్ఫిట్స్ తొందరగా ఇప్పించాలని గత పది సంవత్సరాల నుండి కొంత మందికి బిల్స్ ఇవ్వకుండా హెడ్ ఆఫీస్ నుండి ఇబ్బందులు పెడుతున్నారని చైర్మన్ విన్నవించారు మీరు చెప్పిన సమస్యల సమంజసముగా ఉన్నాయి కచ్చితంగా అధికారులతో సంప్రదించి న్యాయం చేస్తానని చైర్మన్ తిరుపతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.