Take a fresh look at your lifestyle.

రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జిల్లా సివిల్ సప్ల అధికారి నిత్యానంద

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ లో రేషన్ షాప్ పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్, జిల్లా పౌర సరఫరా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో రేషన్ షాప్ లో ఉండాల్సిన బియ్యం కంటే 12.68 క్వింటాళ్ళ బియ్యం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
సంబంధిత డీలర్ పై ఈసీ యాక్ట్-1955 నిబందనల ప్రకారం 6-ఏ కేసు నమోదు చేసినట్లు డిఎస్ఓ నిత్యానంద్ తెలిపారు.
తదుపరి రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వ రేషన్ బియ్యం పంపిణిలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి రేషన్ షాప్ ను తూప్రాన్ మండలం దాతార్పల్లికి చెందిన రేషన్ డీలర్ మేకల ప్రవీణ్ కుమార్ కి అదనపు బాద్యతలు ఇచ్చినట్లు తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.